Breaking News
Home / Film News / మేము ఇంకా ఈ చిత్రానికి టైటిల్ పెట్టలేదు….

మేము ఇంకా ఈ చిత్రానికి టైటిల్ పెట్టలేదు….

ఫిల్మ్ న్యూస్: మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. సామాజిక అంశాలకి కమర్షియల్ విలువలు జోడించి సినిమాని తెరకెక్కించనుండగా, ఈ చిత్ర టైటిల్ ‘గోవిందం ఆచార్య’ అంటూ ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఈ టైటిల్‌తో పోస్టర్ కూడా రూపొందించి వైరల్ చేస్తున్నారు. పోస్టర్‌లో చిరు కమ్యూనిస్ట్ గెటప్‌లో గన్ పట్టుకొని ఉండగా, వెనుక దళం ఉంది. ఫ్యాన్స్ తయారు చేసిన ఈ పోస్టర్ ఒరిజనలా కాదా అనే దానిపై అభిమానులు సందిగ్ధం చెందుతున్న సమయంలో చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ స్పందించింది. మేము ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదని, టైటిల్ పెట్టిన వెంటనే అధికారికంగా ప్రకటిస్తాం అని క్లారిటీ ఇచ్చారు. దేవాలయాలకి సంబంధించిన నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తుండగా, ఇందులో కథానాయిక ఎవరనే దానిపై క్లారిటీ రావలసి ఉంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *