Breaking News
Home / National / మాకు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు…

మాకు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు…

చెన్నై: 2015లో విశ్వనటుడు కమల్‌హాసన్‌ నటించిన ‘ఉత్తమ విలన్‌’ చిత్రం విడుదల సమయంలో ఇబ్బందులు ఏర్పడడంతో కమల్‌ తన దగ్గర రూ.10 కోట్లు తీసుకున్నారని, ఆ డబ్బు తిరిగివ్వలేదని పేర్కొంటూ నిర్మాత జ్ఞానవేల్‌రాజా తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేయడంపై కమల్‌హాసన్‌ స్పందించారు. జ్ఞానవేల్‌ రాజా దగ్గర రూ.10 కోట్లు తీసుకోలేదని, ఈ విషయమై అతను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని కమల్‌హాసన్‌ తరపున నోటీసులు జారీ అయ్యాయి. కమల్‌పై జ్ఞానవేల్‌రాజా ఆరోపణలు కోలీవుడ్‌లో తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారంపై కమల్‌హాసన్‌ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ స్పందిస్తూ, తమకు, జ్ఞానవేల్‌రాజాకు ఎటువంటి సంబంధం లేదని, దర్శకుడు లింగుస్వామి తిరుపతి బ్రదర్స్‌ సంస్థతో మాత్రమే తాము సంప్రదింపులు జరిపామని చెప్పారు. కమల్‌హాసన్‌కు జ్ఞానవేల్‌రాజా ఎటువంటి డబ్బు ఇవ్వలేదని, అసలు ఈ విషయంలో వారిద్దరి మధ్య వ్యక్తిగత చర్యలు కూడా జరగలేదన్నారు. కమల్‌హాసన్‌ పేరుప్రతిష్టలు దెబ్బతీసేలా ఫిర్యాదు ఇచ్చారన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *