హైదరాబాద్ : రాష్ట్ర గిరిజన, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పిలుపునకు మంచి స్పందన వస్తోంది. స్థానికులే కాదు ఎన్ఆర్ఐలు కూడా మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునందుకొని గిరిజన విద్యార్థులకు తాము చేదోడుగా ఉంటామని ముందుకు వస్తున్నారు. నోకియా కార్పోరేషన్ ఆసియా సంస్థ హెడ్ జి.వి సత్యనారాయణ నాయక్, ఆయన సతీమణి శకుంతల కలిసి ఈరోజు మంత్రి సత్యవతి రాథోడ్ ను కలిసి గిరిజన విద్యార్థుల కోసం 100 దుప్పట్లను అందించారు. ఇంకా గిరిజన విద్యార్థుల కోసం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం తమ సంస్థ తరపు నుంచి ఏమి చేయాలో సూచిస్తే కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి కింద చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కార్పొరేట్ ప్రతినిధులు తన పిలుపు మేరకు గిరిజన విద్యార్థులకు సాయం చేయడానికి ముందుకు రావడం పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ గారు హర్షం వ్యక్తం చేశారు.
