Breaking News
Home / States / వారి ప్రాణ త్యాగాలకు మనం రుణపడి ఉండాలి…

వారి ప్రాణ త్యాగాలకు మనం రుణపడి ఉండాలి…

హైదరాబాద్‌: పోలీసుల ప్రాణ త్యాగాలకు మనమెంతో రుణపడి ఉన్నామని తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. మన భవిష్యత్తు కోసం వారి ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సర్కార్‌ ప్రజల భద్రతకు పెద్దపీట వేసిందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ బాగుందని కితాబిచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల సీసీ కెమెరాలు అమర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రూ. 400కోట్లతో పోలీస్ కమాండ్ కంట్రోల్ పూర్తి చేస్తామని, 800 పోలీస్ స్టేషన్లను దీనికి అనుసంధానిస్తామని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, హోంగార్డులందరికీ ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు గుర్తు చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు తమ కర్తవ్యాన్ని గుర్తుచేసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *