Breaking News
Home / National / సరిహద్దుకు బయలుదేరిన చిన్నారులు

సరిహద్దుకు బయలుదేరిన చిన్నారులు

అలీగఢ్ : తెలంగాణకు చెందిన అమరవీరుడు కల్నల్ సంతోష్ సహా ఇరవై మందిని పొట్టనపెట్టుకున్న చైనాకు బదిలిచ్చేందుకు యాతద్భారతదేశం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే… ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్ కు చెందిన పది సంవత్సరాల లోపు వయస్సున్న చిన్నారులు… చైనా సరిహద్దుకు బయలుదేరారు. హైవే మీదుగా నడుచుకుంటూ వెళ్తున్న ఆ చిన్నారులను ఆపిన పోలీసులు… ఆ పిల్లలు చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయారు.

పిల్లలను పోలీసులు… ఎక్కడికెళుతున్నారని అడిగినప్పుడు… ‘చిన్ సే బాడ్లా లేన్ జా రాహే హై., ఉస్నే హమారే జవానో కో మార్ డియా హై(మేము చైనాపై ప్రతీకారం తీర్చుకోబోతున్నాం, వారు మన సైనికులను చంపారు)’ అని పిల్లలు జవాబిచ్చారు. పోలీసులు వారి దేశభక్తి స్ఫూర్తిని చూసి ఆశ్చర్యపోయారు. మాతృభూమి పట్ల వారి ప్రేమను ప్రశంసించారు.

కానీ పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చిన తరువాత, వారి ఇళ్లకు తిరిగి వెళ్లాలని చెప్పారు. పెద్దయ్యాక ఉద్యోగానికి అర్హత సాధించే వరకు శత్రువులతో పోరాడవలసిన అవసరం లేదని పోలీసులు వారికి చెప్పారు, ‘మేము ఉన్నంతవరకు మీరు పోరాడవలసిన అవసరం లేదు. మీరు ఇంట్లో ఉండి చదువులపై దృష్టి పెట్టండి’ అని పిల్లలకు పోలీసులు సూచించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *