హయత్నగర్: హైదరాబాద్లోని హయత్నగర్ ఆర్టీసీ డిపో వద్ద టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్థామ రెడ్డి కార్మికులను కలిశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విధులకు హాజరు కాని కార్మికులని తొలగించాలంటే మొదట తనను ఉద్యోగం నుంచి తొలగించాలని ఆయన అన్నారు. సరైన ప్రణాళికతో శాంతియుతంగా సమ్మెను కొనసాగిస్తామని పేర్కొన్నారు. రేపు బస్సు డిపోల ముందు బతుకమ్మలతో నిరసన తెలియజేస్తామని చెప్పారు. సోమవారం ఇందిరా పార్కు వద్ద నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
