హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ జేఏసీ పట్టువీడటం లేదు… సర్కార్ మెట్టు దిగట్లేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె విరమించేది లేదన్నారు. ‘ఉద్యమ మంత్రుల’తోనే చర్చలు జరుపుతామన్నారు. బీటీ బ్యాచ్‌తో చర్చలు జరిపేది లేదని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.
