Breaking News
Home / States / నా డబ్బుతో అంబులెన్స్ లు ఇస్తాను….

నా డబ్బుతో అంబులెన్స్ లు ఇస్తాను….

సంగారెడ్డి: జిల్లా కేంద్ర ఆసుపత్రికి ఐదు అంబులెన్స్‌లు డొనేట్ చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గురువారం సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గారెడ్డి మాట్లాడుతూ… తన తల్లి, భార్య ఇద్దరూ ఏఎన్ఎంలుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేశారన్నారు. తన తల్లిదండ్రుల పేరిట అంబులెన్స్‌లు ఇస్తానన్నారు. అలాగే ఆసుపత్రిలో లిఫ్ట్, జనరేటర్లు, ఏసీ యంత్రాలు మరమ్మత్తులు చేయిస్తాన్నారు. నెల రోజుల్లో సొంత డబ్బులతో కొత్త అంబులెన్స్‌లు ఇస్తానని, మరమ్మత్తు పనులు చేయిస్తానని.. ఆసుపత్రిలో శాశ్వతంగా పోలీసులు ఉండేలా చర్యలు తీసుకుంటానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *