Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / వారికి ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం..

వారికి ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం..

అమరావతి : అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఏపీ శాసనసభ మూడోరోజు ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్‌ సమాధానమిచ్చారు. కర్నూలు జిల్లాలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌తో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కాటసాని కోరగా.. కర్నూలు జిల్లాలోని శకునాల గ్రామంలో సోలార్‌ పార్క్‌ కోసం భూసేకరణ పూర్తయిందని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని చెప్పారు. క్లీనింగ్‌కు సంబంధించిన ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం జరిగిందని తెలిపారు. భూములు ఇచ్చిన రైతుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. త్వరలో ఈ విషయంపై చర్చించి అందరికీ న్యాయం చేస్తామని మంత్రి తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *