Breaking News
Home / States / Andhra Pradesh / అవినీతి ఆరోపణలపై నివేదిక అందజేస్తాము….

అవినీతి ఆరోపణలపై నివేదిక అందజేస్తాము….

పోలవరం: నేడు ఏపీ బీజేపీ నేతలు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టుకు బయల్దేరి వెళ్లే ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… మోదీ తొలిసారి ప్రధాని అయిన తర్వాత పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపారని చెప్పారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులను ఇస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం ఒక పర్యాటక ప్రాతంగానే చూసిందని, సీరియస్ గా పని పూర్తి చేయాలని అనుకోలేదని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తవుతోందని, ఈ నేపథ్యంలో పోలవరం పనులు ఎంత వరకు వచ్చాయో చూద్దామని అక్కడకు వెళ్తున్నామని కన్నా తెలిపారు. పోలవరంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం, ఆ అవినీతిని నిరూపించి రివర్స్ టెండరింగ్ కు వెళ్తే బాగుండేదని అన్నారు. పోలవరంలో ఎక్కడ అవినీతి జరిగిందో వైసీపీ ప్రభుత్వం ఇంత వరకు కనిపెట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి అవినీతి ఆరోపణలపై నివేదికను అందజేస్తామని చెప్పారు. పోలవరంలో అవినీతి జరింగిందని ఆరోపిస్తూ, కావాల్సిన పనులను ముఖ్యమంత్రి జగన్ చేయించుకుంటున్నారని దుయ్యబట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *