Breaking News
Home / States / వెనకడుగు వేసే ప్రసక్తే లేదు…

వెనకడుగు వేసే ప్రసక్తే లేదు…

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె తెలంగాణలో కొనసాగుతోంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. శనివారం సాయంత్రం 6 గంటల్లోపు ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లో చేరాలని… విధుల్లో చేరని ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని వార్నింగ్‌ ఇచ్చింది. అయినప్పటికీ ఆర్మీసీ కార్మికులు ఏమాత్రం తగ్గలేదు. తమ సమ్మెను యథాతథంగా కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ యూనియన్ల జేఏసీ నేత అశ్వద్థామరెడ్డి మాట్లాడుతూ.. సమ్మె విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని చెప్పారు. ఎంత మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగిస్తుందో తాము కూడా చూస్తామన్నారు. పోరాటాన్ని ఇలాగే కొనసాగించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. మరోవైపు, ప్రైవేట్‌ వాహనాలను నడిపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై అశ్వద్థామరెడ్డి మండిపడ్డారు. ప్రైవేట్‌ వాహనాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *