కృష్ణా: తూర్పు గోదావరి జిల్లాలో జర్నలిస్ట్ సత్యనారాయణ హత్య గురించి సీఎం జగన్‌కి వెంటనే తెలియజేశామని మంత్రి పేర్ని నాని తెలిపారు. వెంటనే జగన్ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని.. జర్నలిస్ట్ సత్యనారాయణ కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
