Breaking News
Home / Sports / ఆస్ట్రేలియా గడ్డపై విజయం సాధిస్తాం: కోహ్లీ

ఆస్ట్రేలియా గడ్డపై విజయం సాధిస్తాం: కోహ్లీ

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్‌ను గెలుసుకుంటామని టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో రెండుసార్లు ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటామని కోహ్లీ అన్నారు. అడిలైడ్‌లో వేదికగా గురువారం ఆసీస్, భారత్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా బాల్ ట్యాంపరింగ్ వివాదం నేపథ్యంలో మరిన్ని జాగ్రతలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌ను సంవత్సరం పాటు నిషేధించారు. మరో నాలుగు నెలలపాటు ఈ ఇద్దరు క్రికెటర్లపై నిషేదం ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్‌ను ఓడించేందుకు ఇదే గొప్ప అవకాశంగా భావించి టీం ఇండియా ముందుకెళ్లాలని క్రికెట్ నిపుణులు కోరుతున్నారు.

Check Also

హామిల్టన్ టీ-20లో పోరాడి ఓడిన భారత్

Share this on WhatsAppహామిల్టన్: మూడు టీ-20ల సిరీస్‌లో భాగంగా సెడెన్ పార్క్ వేదికగా జరుగుతున్న ఆఖరి టీ-20లో భారత్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *