Breaking News
Home / Education / తలకు కార్డ్‌బోర్డ్ బాక్సులు ధరించి …

తలకు కార్డ్‌బోర్డ్ బాక్సులు ధరించి …

కర్నాటక: కర్నాటకలో ఓ ప్రైవేటు కాలేజీ యాజమాన్యం తీరు పట్ల  విద్యాశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు తలకు కార్డ్‌బోర్డ్ బాక్సులు ధరించి పరీక్షలు రాయడం వివాదాస్పదమైంది. హవేరీ జిల్లాలోని భగత్ ప్రీ యూనివర్సిటీ కాలేజీలో ఈ ఘటన జరిగింది. విద్యార్థులు చీటింగ్ కొట్టకుండా ఉండేందుకు వారి తలలకు కార్డ్‌బోర్డ్ బాక్సులను పెట్టారు. అయితే బాక్సుకు ముందు వైపున మాత్రమే ఓపెన్‌గా ఉంచారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర విద్యాశాఖ రంగంలోకి దిగింది. ఈ ఘటన పట్ల వివరణ ఇవ్వాలని ఆ కాలేజీకి విద్యాశాఖ నోటీసులు ఇచ్చింది.

Check Also

జూలై 31 వరకు లాక్‌డౌన్

Share this on WhatsAppదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒడిశాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *