Breaking News
Home / National / తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు…

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు…

ఢిల్లీ : ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల బుధవారం కోస్తా ఆంధ్రప్రదేశ్‌, రాయలసీమ, తెలంగాణ, యానాం, మధ్య మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతోపాటు ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో బుధవారం అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఛత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు పిడుగులు పడవచ్చని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *