చెన్నై: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రేపు చెన్నైకి రానున్నారు. ఆయన రాక కోసం ఎయిర్‌పోర్టు అధికారులు, సిబ్బంది స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన రెండు రోజుల పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. వారిరువుకిది అనధికార సమావేమని తెలుస్తోంది. జమ్మూకశ్మీర్‌కు గల ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేయడంతో పాకిస్తాన్ భారత్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు పలు అగ్రదేశాల నేతలతో సమావేశమై తన గోడు వెల్లగక్కుతోంది. ప్రస్తుతం పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చైనా పర్యటనలోనే ఉన్నారు. ఆయన చైనా ప్రధానితో భేటీ అయి కశ్మీర్ అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలో చైనా అధ్యక్షుడు భారత పర్యటనకు రావడం చర్చనీయాంశమైంది. అమెరికా సహా పలు అగ్ర రాజ్యాలు ఆర్టికల్ 370 విషయంలో భారత్ కు మద్దతునిచ్చిన విషయం తెలిసిందే.
Tamil Nadu: Preparations being done at Chennai Airport ahead of the arrival of Chinese President Xi Jinping. The Chinese President will visit Chennai from October 11-12 for the second Informal Summit between Prime Minister Narendra Modi and him. pic.twitter.com/4pHsgwcjvh
— ANI (@ANI) October 10, 2019