Breaking News
Home / National / ‘బీజేపీ రథ యాత్రకు అనుమతి ఇవ్వం’

‘బీజేపీ రథ యాత్రకు అనుమతి ఇవ్వం’

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ రథ యాత్రకు అనుమతి ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కూచ్ బిహార్ పట్టణం నుంచి రథ యాత్రను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం ప్రారంభించవలసి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్‌కు తన వాదనలు వినిపించింది. ఈ రథ యాత్రకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో తమ కార్యక్రమాలను నిర్వహించుకునే స్వేచ్ఛ అన్ని రాజకీయ పార్టీలకు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని అడ్డుకోవడం సరికాదన్నారు. పరిపాలనా యంత్రాంగం తమకు అనుమతి నిరాకరిస్తే, తాము ఆ యంత్రాంగం సమ్మతి లేకుండానే తమ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెబుతామన్నారు. రథ యాత్ర ప్రారంభమవుతుందని, గమ్యస్థానానికి చేరుకుంటుందని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ప్రభుత్వం అనుమతి మంజూరు చేయకపోయినప్పటికీ దీనిని కచ్చితంగా ప్రారంభిస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు.

Check Also

సభలో కలతచెందిన సోనియాగాంధీ

Share this on WhatsAppన్యూఢిల్లీ: రాఫెల్ డీల్‌పై దేశాన్ని తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *