Breaking News
Home / States / మేమెవరికి చెప్పుకోవాలి ? : రెవిన్యూ సంఘాలు

మేమెవరికి చెప్పుకోవాలి ? : రెవిన్యూ సంఘాలు

హైదరాబాద్ : విధి నిర్వ‌హ‌ణ‌లో అసువులుబాసిన రెవెన్యూ ఉద్యోగుల సంతాప స‌భ ఆదివారం సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రంలో జ‌రిగింది. చ‌నిపోయిన రెవెన్యూ ఉద్యోగుల‌కు అన్ని రెవెన్యూ సంఘాల నేత‌లు సంతాపం తెలియ‌జేశారు. ఈ కార్య‌క్ర‌మానికి డిప్యూటీ క‌లెక్ట‌ర్ల సంఘం అధ్య‌క్షులు వి.ల‌చ్చిరెడ్డి, టీజీటీఏ అధ్య‌క్షులు ఎస్‌.రాములు, టి.వి.ఆర్‌.ఒ.డ‌బ్య్లూఏ రాష్ట్ర అధ్య‌క్షులు గ‌రికె ఉపేంద్ర‌రావు, టి.వి.ఆర్‌.ఒ.ఏ అధ్య‌క్షులు ఎన్‌.ల‌క్ష్మినారాయ‌ణ‌, టీడీఆర్‌వీఆర్వోఏ అధ్య‌క్షులు ర‌వినాయ‌క్‌, టీఎస్‌వీఆర్ఏ అధ్య‌క్షులు వంగూరు రాములు హాజ‌ర‌య్యారు.

స‌మ్మెకూ వెన‌కాడం…
టీవీఆర్వోఏ అధ్య‌క్షులు ల‌క్ష్మీనారాయ‌ణ మాట్లాడుతూ… అన్ని ఉద్యోగ సంఘాలు క‌లిసి ఉద్య‌మించాల‌ని పేర్కొన్నారు. త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి స‌మ్మెకు వెళ్ల‌డానికి కూడా సిద్ధ‌మేన‌ని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల‌కు రెవెన్యూ ఉద్యోగుల మ‌ద్ద‌తు ఉంటుంద‌న్నారు.
రెవెన్యూ ఉద్యోగుల అవ‌మానించ‌డం భావ్య‌మా..?
పోరాడి తెచ్చుకున్న తెలంగాణ‌లో కృంగిపోతున్న‌ది రెవెన్యూ శాఖ‌నేన‌ని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ వీఆర్వో అధ్య‌క్షులు ర‌వినాయ‌క్ పేర్కొన్నారు. రాత్రింబ‌వ‌ళ్లు ప‌ని ఒత్తిడితో తాము ప‌ని చేస్తున్నామ‌ని, అయినా త‌మ‌ను అవ‌మానించ‌డం సరికాదని పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *