Breaking News
Home / States / Andhra Pradesh / ఏపీలో మున్ముందు ఏం జరగబోతోంది?

ఏపీలో మున్ముందు ఏం జరగబోతోంది?

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయా? లేకపోతే కలివిడిగా ఉంటూ విడివిడిగా పోటీ చేస్తాయా? మున్ముందు ఏం జరగబోతోంది? తెలంగాణ ఎన్నికల కోసం మహాకూటమి ఏర్పడింది. కూటమిలో కాంగ్రెస్‌తోపాటు టీడీపీ జతకట్టింది. అంతేకాదు.. ఎన్నికల ప్రచారంలో రాహుల్, చంద్రబాబు కలిసి పాల్గొన్నారు. దీంతో ఏపీలోనూ టీడీపీ-కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందని ప్రచారం జరిగింది. ఇదే సమయంలో జిల్లాకు ఒకటి, లేదా రెండు అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లను కాంగ్రెస్ కోరుకుంటోందని ప్రచారం జరిగింది. అయితే టీడీపీ-కాంగ్రెస్ పొత్తు ఉండదని సంకేతాలు వస్తున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పక్షాలను ఏకం చేస్తున్న చంద్రబాబు కూడా కాంగ్రెస్‌తో పొత్తుకోసం అంతగా ఆసక్తి చూపడంలేదు.

రాష్ట్రంలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే వ్యవహరిస్తామని, జాతీయస్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌తో కలిసి నడుస్తామని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో ఏపీలో టీడీపీ-కాంగ్రెస్ పొత్తు ఉండదని దాదాపు తేలిపోయింది. ఈ వ్యాఖ్యలతో ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా డీలా పడ్డారు. తెలంగాణలో మహాకూటమి విఫలం కావడంతో పొత్తు వద్దని టీడీపీ వ్యూహ కర్తలు చంద్రబాబుకు గట్టిగా చెప్పారు. ఏపీలో పొత్తులపై తుదినిర్ణయం మీదేనంటూ చంద్రబాబుకు రాహుల్ వదిలేశారు.

Check Also

సీఎం జగన్‌పై మాజీ మంత్రి ఫైర్

Share this on WhatsAppఅమరావతి: ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. 62 ప్రాజెక్టుల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *