Breaking News
Home / National / అభ్యంతరకరమైన మెసేజ్‌లు పెట్టిన వాట్పాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్ట్

అభ్యంతరకరమైన మెసేజ్‌లు పెట్టిన వాట్పాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్ట్

మీరట్ : ఓ యువకుడు వాట్సాప్‌లో దేశానికి వ్యతిరేకంగా మెసేజ్‌లు పెట్టాడని అతన్ని పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భాగ్‌పథ్ పట్టణంలో వెలుగుచూసింది. భాగ్‌పథ్ పట్టణానికి చెందిన నయీం అనే 25 ఏళ్ల యువకుడు వాట్సాప్ లో దేశానికి వ్యతిరేకంగా మెసేజ్ లు పెట్టాడని హిందూ జాగరణ్ మంచ్ జిల్లా ఉపాధ్యక్షుడు దీపక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మన దేశ జాతీయ జెండాను అవమానపరుస్తూ వ్యాఖ్యలు పెట్టాడని దీపక్ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు విచారించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పెట్టిన నయీంను అరెస్టు చేశామని ఎస్పీ శైలేష్ పాండే చెప్పారు. 1971 చట్టం ప్రకారం నయీంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వివరించారు.

Check Also

తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ…

Share this on WhatsAppఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవహక్కుల సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *