Breaking News
Home / Film News / వారిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారా?…

వారిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారా?…

బిగ్ బాస్ సీజన్-3 మరొక రెండు వారాల్లో ముగియనుండగా గ్రాండ్ ఫైనల్ లో నిలిచే ఐదుగురు కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయం పై ఇప్పటికే చర్చ మొదలయింది. ప్రస్తుతానికైతే ఇంటిలో వరుణ్ సందేశ్, శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, శివ జ్యోతి, అలీ మరియు వితిక ఉన్నారు. మరో విశేషమేమిటంటే ఈ వారం నామినేషన్లలో మొత్తం ఏడుగురు ఉండడం. దీంతో రేపు ఒకరిని, వచ్చేవారం ఒకరిని ఎలిమినేట్ చేసేస్తే చివరివారం ఐదుగురు కంటెస్టెంట్స్ గ్రాండ్ ఫైనల్  లో టైటిల్ కోసం పోటీ పడతారు. కావున ఈరోజు హౌస్ నుండి బయటకు వెళ్ళిపోయే వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి అభిమానులు అంతా కుతూహలంగా ఉన్నారు.

తాజాగా వచ్చిన రిపోర్టుల ప్రకారం ప్రజలు ఎక్కువగా రాహుల్, శ్రీముఖి, శివజ్యోతి, బాబా భాస్కర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వరుణ్ సందేశ్ దాదాపుగా సేఫ్ పొజిషన్ అని చెప్పొచ్చు. ఇకపోతే మిగిలిన ఇద్దరు… అలీ మరియు వితికలలో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారా అని ఆసక్తిగా ఉంది..? నిన్నటి వరకు తక్కువ ఓట్లతో ఉన్న అలీ మరియు వితికలలో ప్రేక్షకులు ఒక్కసారిగా అలీ వైపు మొగ్గు చూపారు. కాబట్టి వరుసలో చివరన భార్యాభర్తల్లో ఒకరు రేపు ఎలిమినేట్ కాక తప్పేటట్లు లేదు. కచ్చితంగా వారిద్దరిలో వితిక పైన ఉన్న నెగటివిటీ అంతా ఇంతా కాదు. కాబట్టి తాను ఈ వారం బయటికి వెళ్లిపోవచ్చని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇకపోతే వితిక దాదాపు ఇంట్లో ఉన్న అందరి గురించి వెనకాల మాట్లాడడం, వరుణ్ కి ఒక పెద్ద మైనస్ గా నిలబడడం కూడా ఆమె ఇంటికి బయటికి వెళ్లే కారణాలుగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా బిగ్ బాస్ టైటిల్ ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఇంకొక రెండు వారాలు ఆగాల్సిందే.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *