Breaking News
Home / World / హైడ్రాక్సీక్లోరోక్విన్‌పై WHO కీలక వ్యాఖ్యలు…

హైడ్రాక్సీక్లోరోక్విన్‌పై WHO కీలక వ్యాఖ్యలు…

కరోనా వైరస్‌ చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌, క్లోరోక్విన్‌ ఔషధాల వాడకంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరికలు జారీచేసింది. మలేరియా తదితర వ్యాధుల చికిత్సలో వాడుతున్న ఈ మందులను కరోనా విషయంలో ఔషధ పరిశోధనలకు మాత్రమే పరిమితం చేయటం మంచిదని సూచించింది… కరోనా‌ చికిత్సలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను కొన్ని దేశాలు ఇప్పటికే వాడుతున్న విషయంపై WHO స్పందించింది… వివిధ వ్యాధుల చికిత్సలో హైడ్రాక్సీ ఔషధాలను వాడేందుకు అనుమతి ఉందని… ఐతే వీటిని కరోనా చికిత్సలో లేదా దాని నియంత్రణలో ప్రభావవంతంగా పనిచేస్తాయనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదని పేర్కొంది. అయితే కరోనా విషయంలో ఈ  ఔషధ వాడకం ఆయా దేశాల విచక్షణపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది.

Check Also

చెరువులోకి దూసుకు పోయిన బస్సు.. 21 మంది మృతి

Share this on WhatsAppవేగంగా వస్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ చెరువులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో 21 మంది ప్రయాణికులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *