Breaking News
Home / States / ఏసీబీ దాడులు ఎందుకు జరుగుతున్నాయో….

ఏసీబీ దాడులు ఎందుకు జరుగుతున్నాయో….

హైదరాబాద్‌: తెలంగాణ లెక్చరర్స్‌ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మధుసూదన్ రెడ్డి ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో మొత్తం 10 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మధుసూదన్ రెడ్డి అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో బంధువుల వద్ద రూ.50 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగనున్నాయి. మరోవైపు ఏసీబీ దాడులపై మధుసూదన్‌రెడ్డి స్పందించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. తనకు బినామీలు ఎవరూ లేరని చెప్పారు. మహేందర్‌రెడ్డి ఎవరో తనకు తెలియదన్నారు. సోదాల్లో రూ.50లక్షలు దొరికాయని వస్తున్న వార్తలు అవాస్తవమని.. రూ.1.30లక్షల నగదు మాత్రమే లభించిందని చెప్పారు. తమ కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల్లోనూ మినిమమ్‌ బ్యాలెన్స్‌ మాత్రమే ఉందన్నారు. ఏసీబీ సోదాలు ఎందుకు జరుగుతున్నాయో తర్వాత చెబుతానని మధుసూదన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *