Breaking News
Home / Crime / భర్త ఉండగానే 15 ఏళ్లుగా భార్యకు వితంతు పెన్షన్!

భర్త ఉండగానే 15 ఏళ్లుగా భార్యకు వితంతు పెన్షన్!

భర్త బతికుండగానే ఓ మహిళకు వితంతువు పెన్షన్ 15 ఏళ్లుగా ఇస్తున్న ఘటన శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కొత్త పేటలో వెలుగు చూసింది. అదికూడా భర్త ఫిర్యాదుతోనే ఈ విషయం బయటపడింది. స్థానికుల కథనం మేరకు.. 18 ఏళ్ల క్రితం భర్త నుంచి విడిపోయిన రూప అనే మహిళకు అధికారులు విడో పెన్షన్ మంజూరు చేశారు. ఇలా రూపా గత 15 ఏళ్లుగా వితంతువు పెన్షన్ పొందుతోందని భర్త శ్రీను ఆరోపిస్తున్నాడు. 2014 నుంచి ఆన్ లైన్ విధానంలో కూడా వితంతువు పెన్షన్ కోసం రూప దరఖాస్తు చేసుకోంది. అయితే ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా అధికారులు ఆమెకు సర్టిఫికెట్ జారీ చేశారు. రూప 18 ఏళ్ల క్రితమే భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా బతుకుతోంది. అటు భర్త శ్రీను కూడా మరో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో శ్రీనును స్థానికులంతా ప్రశ్నిస్తున్నారు. నువ్వు బతికుండగానే నీ మాజీ భార్య వితంతువు పెన్షన్ ఎలా తీసుకుంటుందంటూ నిలదీశారు. దీంతో అతడు అధికారులు ఫిర్యాదు చేశాడు. ఒంటరి మహిళగా ఆమెకు ఎలాంటి సాయం చేసిన పర్వాలేదని శీను చెబుతున్నాడు. అయితే తాను బతికుండగానే ఆమెకు వితంతువు పెన్షన్ ఎలా మంజూరు చేస్తారని అధికారుల్ని ప్రశ్నిస్తున్నాడు.

Check Also

అనుమతులు లేకుండానే పాలిస్టైరిన్‌ ఉత్పత్తి

Share this on WhatsAppఅనుమతులు లేకుండానే పాలిస్టైరిన్‌ ఉత్పత్తి తప్పు చేశామని 2019 మేలోనే అఫిడవిట్‌ అప్పుడే ఎల్జీ పాలిమర్స్‌ను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *