Breaking News
Home / Crime / నిద్రమాత్రలు కలిపి భర్తను హత్యచేసిన భార్య…

నిద్రమాత్రలు కలిపి భర్తను హత్యచేసిన భార్య…

తమిళనాడు : దోసె పిండిలో నిద్రమాత్రలు కలిపి భర్తను హతమార్చిన భార్యతో సహా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై సమీపంలోని వెంకటేశ నగర్‌ 13వ వీధికి చెందిన సురేష్‌ (24) అదే ప్రాంతంలోని మాంసం దుకాణంలో పని చేస్తున్నాడు. ఇతనికి విల్లుపురానికి చెందిన అనసూయతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి లోకేష్‌ అనే కుమారుడు ఉన్నారు. ఇలా ఉండగా సురేష్‌ మృతి చెందినట్టు సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలం చేరుకున్నారు.

సురేష్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చెన్నై ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. కేసు విచారణలో అనసూయను విచారించగా అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఆమె భర్త సురేష్‌ తరచుగా మద్యం సేవించి తగాదాకు దిగేవాడని తెలిపింది. దీంతో తన బంధువు మారన్‌ (22)ను పిలిపించి, అతని సాయంతో భర్త సురేష్‌ గొంతును దుప్పట్టాతో నులిపి హతమార్చినట్లు తెలిపింది. ముందుగా సురేష్‌కు దోసె పిండిలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వడంతో అతను స్పృహ తప్పినట్లు తెలిపింది. దీంతో అనసూయను పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి మారన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Check Also

కరోనా విజృంభణ..ఢిల్లీ లో బెడ్ల కొరత….

Share this on WhatsAppదేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ విపత్తు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *