Breaking News
Home / Film News / మరోసారి రానున్న అర్జున్ రెడ్డి కాంబినేషన్…

మరోసారి రానున్న అర్జున్ రెడ్డి కాంబినేషన్…

ఫిల్మ్ న్యూస్: సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో మరో చిత్రం రానుందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీలోను ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఇప్పుడు సందీప్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో మరో చిత్రం రానుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. రీసెంట్‌గా జరిగిన అవార్డ్ ఫంక్షన్‌లో విజయ్ దేవరకొండని త్వరలో డైరెక్ట్ చేయనున్నట్టు ప్రకటించాడు సందీప్ రెడ్డి. అయితే 2021లో ఇది జరగొచ్చనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పలు సినిమాలతో బిజీగా ఉండగా, సందీప్ రెడ్డి వంగా కబీర్ సింగ్ ప్రొడ్యూసర్స్‌తో కలిసి మరో బాలీవుడ్ చిత్రాన్ని చేస్తున్నారు. ఇందులో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తారని సమాచారం. ముందుగా ఒప్పుకున్న వారి ప్రాజెక్ట్‌లు అన్నీ పూర్తయ్యాక అర్జున్ రెడ్డి కాంబో మరోసారి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *