Breaking News
Home / Sports / మీడియా సంస్థపై గెలిచిన విండీస్ దిగ్గజ క్రికెటర్ గేల్

మీడియా సంస్థపై గెలిచిన విండీస్ దిగ్గజ క్రికెటర్ గేల్

సిడ్నీ: విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్ విజయం సాధించాడు. మైదానంలో కాదు.. 2015 ప్రపంచకప్ సమయంలో డ్రెస్సింగ్ రూములో తనకు మసాజ్ చేసే మహిళతో గేల్ అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఫైర్‌ఫాక్స్ అనే సంస్థ జనవరి 2016లో కథనాలు రాసింది. ఆ కథనాలను ఖండిస్తూ గేల్ కోర్టు కెక్కాడు. మీడియా సంస్తపై పరువు నష్టం దావా వేశాడు. విచారించిన న్యూ సౌత్ వేల్స్ సుప్రీంకోర్టు గేల్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. తప్పుడు కథనాలు ప్రచురించి గేల్ పరువుకు భంగం కలిగించినందుకు 3 లక్షల ఆస్ట్రేలియా డాలర్లు (రూ.కోటిన్నర) చెల్లించాలంటూ న్యాయమూర్తి లూసి మెకల్లమ్ తీర్పు చెప్పారు.

ఫైర్‌ఫాక్స్ ప్రచురించిన కథనాలు నిజమైనవేనని నిరూపించడానికి అవసరమైనటువంటి ఆధారాలను సమర్పించడంలో మీడియా సంస్థ విఫలమైంది. దీంతో అవి తప్పుడు కథనాలని గతేడాది అక్టోబరులోనే తేలిపోయింది. తాజాగా గేల్ ప్రవేశపెట్టిన సాక్ష్యంతో ఏకీభవించిన కోర్టు గేల్‌పై ఉద్దేశపూర్వకంగా కథనాలు ప్రచురించినట్టు పేర్కొంది. గేల్ ఏ తప్పు చేయలేదని స్పష్టం చేసింది. కోర్టు తీర్పుపై గేల్ ప్రతినిధి గ్రాంట్ వాండన్‌బర్గ్ హర్షం వ్యక్తం చేశాడు.

Check Also

ఆట ఆరంభంలోనే భారత్‌కు షాక్

Share this on WhatsAppపెర్త్: నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఒప్టస్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *