Breaking News
Home / National / 18 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు…

18 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు…

ఢిల్లీ: శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నవంబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 13 వరకు జరగనున్నాయి. 20 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు ఉంటాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ.. ఉభయ సభల సెక్రటరీలకు తెలియజేసింది. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, ఆర్థిక మందగమనం లాంటి అంశాలను సమావేశాల్లో లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే రాజ్యసభలో అధికార పార్టీకి ఎటువంటి సమస్య కనిపించడంలేదు. గత ఆరేళ్లతో పోలిస్తే.. ఈ సారి అధికార పార్టీకి రాజ్యసభలో కావాల్సినంత బలం ఉంది. ప్రతిపక్ష సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలైనా తీసుకునే వీలు ఉన్నది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *