Breaking News
Home / Film News / 1960 కాలం నాటి కథతో….యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

1960 కాలం నాటి కథతో….యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహూ హిందీలో తప్ప ఎక్కడ వర్క్ అవ్వలేదు. దీనితో ప్రభాస్ ఆశలు, అతని ఫ్యాన్స్ ఆశలు తన తదుపరి చిత్రం జాన్ మీదే. ఇప్పటికే సినిమా కొంత షూటింగ్ జరిగింది. ఈ నెలలోనే షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా కొంత టైం తీసుకుని అంతా సరిచూసుకోవాలి టీం కొంత డిలే చేసిందట. ఈ చిత్రం కోసం ఒక భారీ సెట్ తయారు అవుతుంది.

ఇంకో 20 రోజుల సమయం పట్టొచ్చు. అది పూర్తి కాగానే షూటింగ్ మొదలు పెడతారు. సినిమాలో మిగిలి ఉన్న భాగం మెజారిటీ ఈ సెట్ లోనే జరుగుతుంది. ప్రస్తుతం యూరోప్ హాలిడే లో ఉన్న ప్రభాస్ ఈ వారాంతంలో హైదరాబాద్ తిరిగి వస్తాడట. 1960 కాలం నాటి కథతో సినిమా తెరకెక్కుతోంది. అంచనాలు భారీగా ఉన్నాయి.

ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈరోజు సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని అంతా భావించినా అటువంటిది ఏమీ జరగలేదు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా కోసం పాతిక వరకూ సెట్స్ హైదరాబాద్ లో నిర్మిస్తున్నారట. ఈ సెట్లు అప్పటి యూరోప్ నగరాలను పోలి ఉంటాయట. సాహూ సినిమా లాగానే జాన్ కూడా రెండో సినిమా డైరెక్టర్ దర్శకత్వం వహించడం గమనార్హం.

జిల్ అనే ఫెయిల్యూర్ సినిమా తీసిన రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాహూలో ప్రభాస్ హెయిర్ స్టయిల్ గురించి, బరువు గురించి కొంత నెగటివ్ టాక్ వచ్చింది. దీనితో ఆయన బరువు తగ్గి, హెయిర్ స్టయిల్ కూడా మారచాలని ప్రభాస్ అనుకుంటున్నాడట.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *