Breaking News
Home / States / Andhra Pradesh / వరదతో నిలిచిన బోటు వెలికితీత పనులు….

వరదతో నిలిచిన బోటు వెలికితీత పనులు….

రాజమండ్రి: గోదావరి వరద పెరుగుతుండడంతో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటు వెలికితీత పనులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ధర్మాడి సత్యం అన్నారు. నాలుగు రోజులుగా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, తొలిరోజు యాంకర్ ద్వారా బోటు ఆచూకీ కోసం ప్రయత్నించగా అది పెద్ద పెద్ద రాళ్లకు తగిలి విరిగి పోయిందన్నారు. రెండవ రోజు రెండు యాంకర్లతో ప్రయత్నాలు కొనసాగించగా, యాంకర్లు బండరాళ్లకు తగులుకోవడంతో రోప్‌లు తెగిపోయాయని తెలిపారు. మూడవ రోజు గోదావరి వరద ఉధృతి పెరగటంతో వెలికితీత పనులు ఆపివేశామని ఆయన వివరించారు. గుల్లా వెంకట శివ మాట్లాడుతూ బోటు ఆచూకీ కోసం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టామన్నారు. బోటు ఉన్న ప్రదేశాన్ని పక్కాగా గుర్తించామని, సుడిగుండాలకు యాభై మీటర్ల సమీపంలో బోటు ఉందని శివ చెప్పాడు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *