అమరావతి: మహాత్మాగాంధీ ఆదర్శాలే స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అమరావతిలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో సీఎం జగన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… గాంధీ గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా ఇవాళ్టి నుంచి సాకారం చేస్తున్నామన్నారు. గత 4 నెలల్లోనే 43వేల బెల్ట్‌షాపులను మూసివేయించామన్నారు. రైతులు, పేదల సంక్షేమం, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి నవరత్నాలు అమలు చేస్తున్నామన్నారు.
