Breaking News
Home / Politics / ఆయన మాటల వల్లే పార్టీ ఓడిపోయింది….

ఆయన మాటల వల్లే పార్టీ ఓడిపోయింది….

హైదరాబాద్‌: నేడు పీసీసీ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ మాట్లాడుతూ కులాలకు అతీతంగా సామాజిక న్యాయం కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమని, బీసీలకు కాంగ్రెస్‌లో అన్యాయం జరుగుతుందనే వీహెచ్ మాటలు సరికాదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్‌లుగా వీహెచ్, కేకే, బొత్స సత్యనారాయణ, డి.శ్రీనివాస్ ప్రత్యేక తెలంగాణలో తొలి పీసీసీ పొన్నాల కూడా బీసీలే అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో బీసీలకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. వీహెచ్ మాటలతోనే హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ ఓడిందని, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన ఆయనపై తక్షణం హైకమాండ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవే అంశాలను ప్రస్తావిస్తూ అధిష్ఠానానికి లేఖ రాశానని, క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. రాజీవ్‌ కాంగ్రెస్‌ పేరుతో పార్టీ పెడుతున్నట్లు వీహెచ్‌ ప్రకటన చేశారని, సొంత పార్టీ నేతలపైనే ఆయన విమర్శలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *