Breaking News
Home / National / అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో…

అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో…

రాజ్‌కోట్: గుజరాత్‌ రాజ్‌కోట్‌లో అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో ముఖ్యమంత్రి విజయ్ సోదరుడు వరుసయ్యే అనిల్ సంఘ్వీ చనిపోయారు. అనిల్‌ అనారోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులు 108 నెంబర్‌కు ఫోన్ చేశారు. అయితే అంబులెన్స్ 41 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. ఇంతలో అనిల్ కన్నుమూశారు.  అంబులెన్స్ సిబ్బంది  సకాలంలో చేరి ఉంటే ఆయన ప్రాణాలు కాపాడేవారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాజ్‌కోట్ కలెక్టర్ దర్యాప్తు జరుపుతున్నారు. అనిల్‌ చనిపోవడంతో ముఖ్యమంత్రి విషాదంలో మునిగిపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయ్ రూపాని ఆదేశించారు.

Check Also

సింహానికి ఎదురుగా కూర్చొని…..

Share this on WhatsAppన్యూఢిల్లీ: ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో ఒక వ్యక్తి సింహానికి ఎదురుగా కూర్చున్నాడు. దీనికి సంబంధించిన వీడియో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *