నల్గొండ: హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నికలపై బీజేపీ నేత జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ గెలిస్తే సైదిరెడ్డి వ్యాపారాలు పెంచుకుంటారని, మరోవైపు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఉత్తమ్ కుటుంబానికే ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. బీజేపీ గెలుపుతోనే ప్రజలకు మేలు జరుగుతుందని జితేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
