హైదరాబాద్: సివిల్స్‌లో ఎంపిక కాలేదన్న మనస్తాపంతో నగరంలో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ముసారాంబాగ్ వంతెన పైనుంచి యువతి మూసీ నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. కాగా స్థానికులు యువతిని రక్షించి అంబర్ పేట పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు యువతికి కౌన్సెలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు.
