Breaking News
Home / National / ఎక్స్‌ప్రెస్‌ రైల్లో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ….

ఎక్స్‌ప్రెస్‌ రైల్లో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ….

మధిర: ఆదివారం షాజాన్‌బీ అనే నిండు గర్భిణి సికింద్రాబాద్‌ నుంచి బిహార్‌కు గౌతమి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో వెళుతోంది. మధిర రైల్వేస్టేషన్‌ సమీపంలోకి రాగానే ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువై పండంటి బిడ్డను ప్రసవించింది. తోటి ప్రయాణికులు మధిర రైల్వేస్టేషన్‌ మాస్టర్‌కు సమాచారం అందించగా ఆయన 108సిబ్బందికి తెలియజేయడంతో ఆ అంబులెన్స్‌ వాహనం హుటాహుటిన మధిర రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. మధిరలో రైలు ఆగిన వెంటనే ఆ తల్లీబిడ్డను మధిర సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ క్షేమంగా ఉన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *