Breaking News
Home / Uncategorized / బెల్ట్ షాపులపై మహిళలు దాడి….

బెల్ట్ షాపులపై మహిళలు దాడి….

ఆసిఫాబాద్: బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలపై మహిళలు కన్నెర్ర చేశారు. తమ కుటుంబాల్లో చిచ్చుపెడుతున్న బెల్ట్ షాపులపై దాడి చేశారు. భారీ ఎత్తున మద్యం నిల్వలను ధ్వంసం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా, పాటిబండ సమీపంలోని వట్టివాగు ప్రాజెక్టు పునరావాస గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ గ్రామంలో కిరాణాషాపుల్లో కొన్నాళ్లుగా మద్యం విక్రయాలు చేస్తున్నారు. దీంతో గ్రామానికి చెందిన యువత మద్యానికి బానిస అవుతోంది. ప్రతి కుటుంబంలోనూ మద్యం చిచ్చురేపుతోంది. నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. నిన్న దసరా పండుగరోజు విచ్చలవిడిగా విక్రయాలు జరపడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలంతా కలిసి బెల్ట్ షాపులపై దాడి చేశారు. దొరికిన మద్యాన్ని దొరికినట్టే ధ్వంసం చేశారు. ఇంకోసారి అమ్మితే తీవ్రపరిణామాలు తప్పవని హెచ్చరించారు.

Check Also

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం…

Share this on WhatsAppన్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ని కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆరోగ్య …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *