Breaking News
Home / States / Andhra Pradesh / రెండో రోజుకు చేరుకున్న మహిళల నిరాహార దీక్ష…

రెండో రోజుకు చేరుకున్న మహిళల నిరాహార దీక్ష…

తూర్పు గోదావరి: జగ్గంపేటలోని ఇళ్ల మధ్యలో మద్యం దుకాణం వద్దంటూ ఆంధ్రప్రదేశ్‌ రైతు కూలీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమేష్‌ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు చేపట్టిన రిలే నిరాహారదీక్ష మంగళవారంతో రెండో రోజుకు చేరింది. జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న బ్రాందీ షాపును నిలిపివేయాలని రెండవ రోజు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తక్షణం ఆబ్కారీ అధికారులు వచ్చి మద్యం షాపును రద్దు చేస్తామని హామీ ఇచ్చేవరకూ ఈ ధర్నా కొనసాగుతుందని రమేష్‌ స్పష్టం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *