Breaking News
Home / National / రాష్ట్రంలోని మహిళలకు భద్రత లేదు….

రాష్ట్రంలోని మహిళలకు భద్రత లేదు….

లక్నో : ఉన్నావ్‌ బాధితురాలు మరణంపై  బీఎస్పీ అధినేత మాయావతి స్పందించారు. రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు. కోర్టు విచారణకు వెళ్తున్న ఉన్నావో బాధితురాలిని రైల్వేస్టేషన్‌ సమీపంలో నిందితులు అడ్డుకొని పెట్రోల్‌ పోసి నిప్పంటించిన విషయం తెలిసందే. 90 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు మరణించింది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంపై మాయావతి విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వంలో మహిళలు సురక్షితంగా లేరని వ్యాఖ్యానించారు. యూపీ గవర్నర్‌ ఆనందీ బెన్‌ పటేల్‌ కూడా ఒక మహిళేనని, మరో మహిళ బాధలను ఆమె అర్థం చేసుకోగలరని తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు.

 

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *