Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / మహిళల మనోభావాలను దెబ్బతీశాయి..

మహిళల మనోభావాలను దెబ్బతీశాయి..

అమరావతి : రేపిస్టుల విషయమై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి డిమాండ్‌ చేశారు. షాద్‌నగర్‌ ఘటన కేసులో నిందితులను బహిరంగంగా ఉరి తీయాలంటూ జనం చేస్తున్న డిమాండ్‌ సరికాదని, రేపిస్టులను బెత్తంతో రెండు దెబ్బలు కొడితే సరిపోతుందంటూ పవన్‌ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పవన్‌ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని, మహిళలకు ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆడపిల్లల మాన, ప్రాణలంటే నీకు అంత చులకనా అంటూ పవన్‌పై ధ్వజమెత్తారు. పవన్‌ కల్యాణ్‌ మాటలు మహిళల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసే వారిని కఠినంగా శిక్షించేందుకు కొత్త చట్టాన్ని తీసుకువస్తామని తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *