Breaking News
Home / States / బెల్ట్‌ షాపులపై మహిళల దాడి…

బెల్ట్‌ షాపులపై మహిళల దాడి…

ఖమ్మం : అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్‌ షాపులను తొలగించాలని అనేకసార్లు ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో గ్రామంలోని మహిళలందరూ ఏకమై బెల్ట్‌ షాపును తొలగించారు. మండల పరిధిలోని జయలక్ష్మీపురంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్‌షాపులపై సోమవారం మహిళలు దాడులు నిర్వహించారు. మద్యం సీసాలను ధ్వంసం చేశారు. బెల్ట్‌ షాపులు తొలగించాలని నినాదాలు చేస్తూ సోమవారం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. జయలక్ష్మీపురం పంచాయతీ ఆంధ్రా సరిహద్దులో ఉందని, అక్కడ మద్యపాన నిషేధం అమలు కావడంతో, గ్రామంలో అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళలు కిరాణా షాపునకు వెళ్లాలన్నా ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *