పశ్చిమ గోదావరి : బ్రాందీ షాపును ఎత్తేయాలంటూ.. ఐద్వా ఆధ్వర్యంలో ఆలమూరు మహిళలు శనివారం వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పెనుమంట్ర మండలం ఆలమూరు పరిధిలోని కొయ్యేటిపాడు రోడ్డులో ఉన్న ప్రభుత్వ బ్రాంది షాపును ఎత్తి వేయాలంటూ.. గత నాలుగు రోజులుగా ఐద్వా ఆధ్వర్యంలో స్థానిక మహిళలు చేపట్టిన నిరసన నేటితో అయిదో రోజుకు చేరింది. అయిదో రోజున వినూత్న రీతిలో గడ్డిపరకలను తింటూ.. మహిళలు నిరసన వ్యక్తపరిచారు.
