హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 26వ రోజు కొనసాగుతోంది. హైదరాబాద్‌లో తగినన్ని బస్సులు నడవకపోవడంతో ప్రయాణీకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయాలు, ఇళ్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ప్రమాదకర స్థితిలో ప్రయాణిస్తున్నారు. మలక్‌పేట బస్సు ప్రయాణీకులతో నిండిపోవడంతో మహిళలు ఫుట్‌బోర్డుపై ప్రయాణం చేస్తున్నారు. స్పీడ్ బ్రేకర్లు, గుంతలు వచ్చినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించకపోతే ప్రమాదాలు జరుగుతాయి.
