తిరుపతి : శ్రీసిటీ పరిధిలోని ఆరూరులో ప్రభుత్వ మద్యం షాపు వద్ద శనివారం మహిళలు బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ మద్యం షాపును రద్దు చేయాలని గత నెల రోజులుగా అక్కడి గ్రామ పెద్దలు ప్రభుత్వాన్ని కోరారు. నాలుగు రోజులుగా ఆరూరులో షాపు మూత పడడం జరిగింది. అయితే శనివారం మళ్లీ మద్యం షాపు తెరవడంతో మహిళలు ఒక్కసారిగా షాపు వద్దకు వచ్చి అక్కడే కూర్చొని నిరసన కొనసాగిస్తున్నారు. షాపు తెరిస్తే సహించేది లేదని వారు అక్కడే నిరసన కొనసాగిస్తున్నారు. మద్యం షాపు రద్దు చేయాలని దండాలు పెట్టీ విన్నవించగ దీంతోఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి షాపును రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
