న్యూఢిల్లీ: 2020-2021 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను ప్రపంచ బ్యాంకు తగ్గించింది. ఆదివారం విదుల చేసిన తన నివేదికలో 7.5 శాతం నుంచి 6 శాతానికి వృద్ధిరేటును కుదిస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు పేర్కొంది. దేశంలో తీవ్ర స్థాయిలో ఆర్థిక మందగమనం ఉన్నందువల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు నివేదికలో తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో (ఏప్రిల్) దేశ ఆర్థిక వ్యవస్థ బాగానే ఉందని పేర్కొన్న ప్రపంచ బ్యాంకు.. ఒక్కసారిగా 6 శాతానికి వృద్ధిరేటును తగ్గించడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. అయితే ఆరేళ్ల కనిష్ట్ స్థాయిలో వృద్ధిరేటు కొనసాగుతున్నట్లు ప్రకటించింది. కాగా, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 5 శాతం వృద్ధే ఈ ప్రతికూలకు కారణమని అభిప్రాయపడుతున్నారు.
‘‘ఆర్థిక పరిస్థితిపై నిబద్ధత చూపించినప్పటికీ వృద్ధి ఒక్కసారిగా క్షీణించడం, దానికి అడ్డుకట్ట వేసే కార్పొరేట్ పన్నులు తగ్గించడం వల్ల ఆర్థిక పరిస్థితులు దిగజారాయి’’ అని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది.