Breaking News
Home / National / వరల్డ్‌ హార్ట్‌ డే రోజునే గుండె అమరిక…

వరల్డ్‌ హార్ట్‌ డే రోజునే గుండె అమరిక…

బెంగళూరు: మైసూరుకు చెందిన 40 ఏళ్ళ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ 4 నెలల క్రితం జీవసార్థకతె (జడ్‌సిసికె)లో రిజిస్టర్‌ చేసుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన 26 ఏళ్ళ యువకుడు బ్రెయిన్‌డెడ్‌ అయినట్టు ఓల్డ్‌ ఎయిర్‌పోర్టు రోడ్డులోని మణిపాల్‌ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు వరల్డ్‌ హార్ట్‌ డే రోజునే మణిపాల్‌ ఆసుపత్రి నుంచి బీఈఎంఎల్‌ రోడ్డులోని రామయ్య నారాయణ హార్ట్‌సెంటర్‌కు ఆదివారం వేకువజామున జీరో ట్రాఫిక్‌లో తరలించి మైసూరు వాసికి శస్త్ర చికిత్స ద్వారా గుండె అమరిక విజయవంతం చేసి జీవం పోశారు. శస్త్ర చికిత్సలో హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ రవిశంకర్‌శెట్టి, డా.నాగమల్లేశ్‌, వరుణ్‌శెట్టి, ప్రశాంత్‌ రామమూర్తి, గురు పోలీస్‌ పాటిల్‌లు భాగస్వామ్యులయ్యారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *