Breaking News
Home / Featured / యాహూ! మరో కొత్త ఫీచర్‌….

యాహూ! మరో కొత్త ఫీచర్‌….

యాహు న్యూస్:ఒకప్పుడు ఇంటర్నెట్‌ సెర్చి ఇంజిన్‌గా, ఈ-మెయిల్‌కు పర్యాయపదంగా వెలిగిన యాహూ ఆ తర్వాత మిగతా సంస్థల నుంచి పోటీ ని తట్టుకోలేక వెనుకబడిపోయింది. అయితే, పూర్వ వైభవాన్ని సంపాదించుకునేందుకు యాహూ మెయిల్‌ తాజాగా ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా సరికొత్త ఫీచర్స్‌తో పాటు మొబైల్‌ యాప్‌ను రీబ్రాండింగ్‌ చేయడం ద్వారా యూజర్లను ఆకర్షించేందుకు కసరత్తు చేస్తోంది. యాహూ మెయిల్‌ యూజర్లు..’పీపుల్‌ వ్యూ’ పేరిట మరో కొత్త ఫీచర్‌ వినియోగించుకోవచ్చు. పీపుల్, ట్రావెల్, రిసీట్స్‌ వంటి మూడు కేటగిరీల్లో కింద మెయిల్స్‌ను విడగొట్టుకోవచ్చు. ఇవే కాకుండా పలు రకాల ఫిల్టర్స్, అటాచ్‌మెంట్‌ ఆప్షన్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి. మిగతా ఈ-మెయిల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ తరహాలోనే బహుళ ఈ-మెయిల్‌ ఖాతాలను యాహూ మెయిల్‌ యాప్‌నకు అనుసంధానించుకోవచ్చు. పెద్ద ఫోన్స్‌ను ఒంటి చేత్తో ఆపరేట్‌ చేసేటప్పుడు కూడా సులువు గా ఉపయోగించుకోగలిగేలా యాప్‌లో ఫీచర్స్‌ను తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

Check Also

నెల్సన్‌ మండేలా కుమార్తె కన్నుమూత

Share this on WhatsAppజోహన్నెస్‌ బర్గ్‌, జూలై 13: నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా కుమార్తె జిండ్జీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *