Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ప్రత్యక్ష ప్రసారాల నిలిపివేతపై యనమల ఆగ్రహం

ప్రత్యక్ష ప్రసారాల నిలిపివేతపై యనమల ఆగ్రహం

అమరావతి: శాసన మండలి ప్రసారాలను నిలిపివేయడంపై టీడీపీ ఎమ్మెల్సీ యనమల మండిపడ్డారు. అసెంబ్లీ లాబీలు, చాంబర్స్‌లో ప్రత్యక్ష ప్రసారాలు ఆపేయడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మండలి చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. తన ఆదేశాలు లేకుండా ప్రసారాలు నిలిపివేయడంపై చైర్మన్‌ షరీఫ్ కూడా విస్తుపోయారు. తక్షణమే ప్రసారాలు పునరుద్దరించాలని రూలింగ్ పాస్ చేశారు. కొన్ని సెషన్స్ నుంచి మూడు చానళ్లను నిషేధించడాన్ని కూడా ఎమ్మెల్సీ యనమల ప్రస్తావించారు. శాసనసభ వేరు, శాసన మండలి వేరని మండలి చైర్మన్అన్నారు. మండలి కవరేజ్‌కు అన్ని మీడియా సంస్థలను అనుమతించాలని చైర్మన్ రూలింగ్ పాస్ చేశారు. దానిపై గతంలోనే రూలింగ్ ఇచ్చానని అన్ని చానళ్లను కౌన్సిల్ ప్రసారాలకు అనుమతించాలని చైర్మన్‌ ఆదేశించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *