Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఏపిలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలి

ఏపిలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలి

అమరావతి: వైసీపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్టికల్ 360 కింద ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని డిమాండ్ చేశారు. గత 8నెలల్లో వైసీపీ పాలనలో రాష్ట్రంలో ప్రగతి గుండుసున్నా అని విమర్శించారు. ఆదాయం పడిపోవడమే కాకుండా రెవిన్యూ వ్యయం పెరిగిందన్నారు. మూలధన వ్యయం రూ.10,486 కోట్లు తగ్గిందని, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఇవ్వడమే కష్టం అయ్యిందన్నారు. సంక్షేమంపై వ్యయం రూ.2వేల కోట్లు తగ్గించారని, పేదల సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచారని ఆరోపించారు.

వచ్చే ఆదాయం అంతా జీతాలు, పెన్షన్లకే సరిపోతుందని, అభివృద్ది పనులకు, సంక్షేమానికి పైసా లేదని యనమల విమర్శించారు. ధరలు పెరిగడంతో కొనుగోలు శక్తి తగ్గిందన్నారు. రివర్స్ టెండర్ల పేరుతో అభివృద్దిని రివర్స్ చేశారని, దానితో పేదల సంక్షేమం కూడా రివర్స్ అయ్యిందని విమర్శించారు. రాజకీయ సంక్షోభంలో వైసీపీ చిక్కుకుందన్నారు. ఇన్ని సమస్యలున్నా సీఎం జగన్ చిద్విలాసంగా ఉన్నారన్నారు. పైశాచిక ఆనందంలో మునిగితేలుతున్నారని, ఒక్కఛాన్స్ వచ్చింది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశానన్న పిచ్చి ఆనందమే ఆయనకు మిగిలిందన్నారు. ఈ ఏడాది బడ్జెట్ అంచనాల్లో ద్రవ్యలోటు రూ.35,260కోట్లు ఉంటే, 8నెలల్లోనే రూ.35వేల కోట్ల అప్పులు చేశారన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చక్కదిద్దే సామర్ధ్యం వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు.

3 రాజధానులు అంటూ జగన్ రాష్ట్రంలో గందరగోళం సృష్టించారని, టీడీపీ హయాంలో వచ్చిన పెట్టుబడులను తరిమేశారని యనమల ఆరోపించారు. యువత ఉపాధి అవకాశాలను పోగొట్టారన్నారు. సంపద సృష్టి అవకాశాలన్నీ మూసుకుపోయాయని, అన్ని శాఖల్లో ఆర్ధిక అస్థిరత ఏర్పడిందన్నారు. క్రెడిట్ అవకాశాలు నీరుగారి పోయాయని, తక్షణం రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని యనమల రామకృష్ణడు డిమాండ్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *