Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఆర్థిక అభివృద్ధిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు….

ఆర్థిక అభివృద్ధిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు….

అమరావతి: రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ నడుస్తోందనడానికి తాజా పరిణామాలే అందుకు నిదర్శనమని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ దేశంలో 10వస్థానానికి పడిపోయిందని నీతిఆయోగ్‌ వెల్లడించిందని తెలిపారు. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్‌ చిట్టచివరి ర్యాంకులో ఉంటే కర్ణాటక మొదటి ర్యాంకు సాధించిందని యనమల పేర్కొన్నారు. దేశంలో రాష్ట్రం పతనమవుతాందనటానికి ఇదే నిదర్శనమన్నారు. పెట్టుబడిదారులెవరూ రాష్ట్రంపై ఆసక్తి కనబరచడంలేదన్నది నీతి ఆయోగ్‌ ర్యాంకుల ద్వారా స్పష్టమవుతోందన్నారు.

తెలుగుదేశం హయాంలో సులభతర వాణిజ్యంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామని యనమల తెలిపారు. ఎన్నో పెట్టుబడులను, పారిశ్రామికవేత్తలనూ ఆకర్షించామన్నారు. జగన్‌ హయాంలో ఎలాంటి పెట్టుబడులు, ప్రైవేటు ఉద్యోగాలు, ఆర్థికాభివృద్ధి లేదన్నది స్పష్టమవుతోందన్నారు. తలసరి ఆదాయం 17వేల రూపాలయలకు గణనీయంగా పడిపోయిందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైందని… ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని యనమల ప్రశ్నించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *